ఈ పని చేస్తే పాకిస్థాన్ మన పెంపుడు పిల్లే!: సుబ్రహ్మణ్య స్వామి

ఎంతకీ కొరుకుడు పడని ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ పన్నిన వ్యూహాన్నే భారత్, పాక్ పై అవలంబించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సలహా ఇచ్చారు. ఓ శత్రువును లొంగదీసుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తులు ఇప్పుడు వారి మధ్య చర్చల వరకూ వెళ్లాయని గుర్తు చేస్తూ, పాకిస్థాన్ ను అదే విధంగా దారిలోకి తెచ్చుకోవాలని సూచించారు.

తొలుత పాకిస్థాన్ ను భయపెట్టాలని, ఇండియా తలచుకుంటే, ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేయగలుగుతుందన్న ఆందోళనను పుట్టించాలని తన ట్విట్టర్ ఖాతాలో స్వామి వ్యాఖ్యానించారు. ఇక రెండో దశలో చైనాను తటస్థంగా ఉంచాలని, ఆపై పాకిస్థాన్ ఓ పెంపుడు పిల్లిలా ఇండియా ముందు తోకాడిస్తూ కూర్చుంటుందని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, సరిగ్గా చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
North Korea
Donald Trump
India
Pakistan

More Telugu News