నడిరోడ్డుపై విదేశీయుడి శృంగారం.. లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన ముంబై పోలీసులు!
- నడిరోడ్డుపై శృంగారంలో మునిగిపోయిన విదేశీయుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తుండగా యువతి పట్టుబడింది. యువకుడు రష్యా నుంచి వచ్చినట్టు గుర్తించి అతడి కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న యువతి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టు గుర్తించారు.
ఓసారి తాము గోవా నుంచి వచ్చామని, మరోసారి రష్యా అని, జెనీవా అని చెబుతున్నప్పటికీ ఆహార్యాన్ని బట్టి ఆమె భారతీయురాలేనని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. యువతిని చెంబూరులోని మహిళా సురక్షా కేంద్రానికి తరలించినట్టు తెలిపారు.