ముంబయిలో భారీ వర్షం.. అత్యవసరమయితేనే రోడ్లపైకి రావాలని పోలీసుల సూచన
- నానా అవస్థలు పడుతోన్న ప్రజలు
- రహదారులపై వర్షపు నీరు
- మరికొన్ని రోజుల పాటు భారీ వర్షం
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమయితేనే రోడ్లపైకి రావాలని పోలీసులు సూచించారు. ముంబయిలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయి మున్సిపల్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారులకు వారాంతపు సెలవులను రద్దు చేశారు.