ఈ రోజు మరింతగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- వరుసగా పదో రోజు ధరల్లో తగ్గుదల
- పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 15 పైసలు
- హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ.82.01
- డీజిల్ ధర లీటర్ రూ.74.54
హైదరాబాద్ మార్కెట్లో డీజిల్ 17 పైసలు తగ్గి ఈ రోజు రూ.74.54గా ఉంది. పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.82.01గా ఉంది. వైజాగ్ సిటీలో పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.82.76గా ఉండగా, డీజిల్ 16 పైసలు తగ్గి రూ.75.01గా ఉంది. గుంటూరులో డీజిల్ 16 పైసలు తగ్గుదలతో రూ.75.86, పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.83.62గా ఉంది. ఢిల్లీలో 21 పైసలు తగ్గి పెట్రోల్ లీటర్ రూ.77.42గా, డీజిల్ 15 పైసలు తగ్గి రూ.68.58గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వరుసగా ఇది పదో రోజు.