ముహూర్తం సమయానికి పెళ్లికూతురు జంప్.. మరో అమ్మాయి మెడలో తాళి కట్టేసిన వరుడు!
- తమిళనాడులో జూన్ 4న ఘటన
- వెతికినా కనిపించని పెళ్లికూతురు
- అదే ముహూర్తానికి బంధువుల అమ్మాయిని పెళ్లాడిన వరుడు
జూన్ 4వ తేదీన పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. బంధుమిత్రులంతా పెళ్లికి హాజరయ్యారు. తీరా ముహూర్త సమయానికి పెళ్లికూతురు అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా కనిపించలేదు. దీంతో, అప్పటికప్పుడు బంధువుల అమ్మాయితో పెళ్లి జరిపించేశారు.
ఆ తర్వాత పెళ్లికుమార్తె అదృశ్యంపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయిందా? లేక ప్రేమ కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.