Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోమియో స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీలు తీసుకుంటూ హీరోయిన్ ప్రణీత సందడి!

  • రూ. 9,990 ధరలో 'ఎక్స్ 1 నోట్'
  • ఆకర్షణీయమైన ఫీచర్లు
  • మూడు కెమెరాలు, ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా
ఇటీవల 'అత్యంత భరోసా బ్రాండ్'గా 'ఎకనామిక్ టైమ్స్' నుంచి గుర్తింపు పొందిన కోమియో, దక్షిణాది మార్కెట్లో మరింత మార్కెట్ వాటా కోసం తన తాజా స్మార్ట్ ఫోన్ 'ఎక్స్ 1 నోట్'ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ప్రణీత, కొత్త స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. రూ. 9,990 ధరలో లభించే ఈ ఫోన్ లో 13/5 ఎంపీ డ్యూయల్ కెమెరాలు వెనుకవైపున, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

6 అంగుళాల స్క్రీన్, ఫుల్ వ్యూ, 2.5 కర్వ్ డ్ డిస్ ప్లే, 1.45 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటాయని కోమియో స్మార్ట్ ఫోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజయ్ కలిరోన వెల్లడించారు. రూ. 5 వేల నుంచి రూ. 10 వేల రేంజ్ లో తాము 5 రకాల ఫోన్ లను అందిస్తున్నామని ఆయన అన్నారు. ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రామ్ సదుపాయాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. విక్రయానంతర సేవల్లో భాగంగా ఒక సంవత్సరం 100 రోజుల వారెంటీ, వన్ టైమ్ స్క్రీన్ బ్రేకేజ్ వారంటీ, బై బ్యాక్ లను కూడా అందిస్తున్నామన్నారు.
Comio
Smartphone
X1 Note
Praneeta

More Telugu News