మెగాస్టార్, కేటీఆర్ లకి సవాలు విసిరిన రామ్ చరణ్!
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పని సరి అంటూ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మొదలు పెట్టిన ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ కి దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ తారలు, సామాన్యులు, క్రీడాకారులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని వారు చేస్తున్న వ్యాయమ వీడియోలను ఇతరులకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన సవాలును రామ్ చరణ్ స్వీకరించారు. దీనికి సంబందించిన ఫిట్‌నెస్ వీడియోని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘హేయ్ ఎన్టీఆర్ అన్న.. నీ సవాలును స్వీకరించా. సుకుమార్, కేటీఆర్, సందీప్ కోశ్లా, శోభనా కామినేని, వరుణ్‌తేజ్, మన మెగాస్టార్‌కు ఛాలెంజ్ విసురుతున్నా’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు.