Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో సెట్లో కుటుంబ వాతావరణం ఉండేది .. ఇప్పుడది లేదు: నటి దివ్యవాణి

  • మంచి సినిమాలు వస్తున్నాయి 
  • సాంకేతికంగా అభివృద్ధి కనిపిస్తోంది 
  • ఆప్యాయతలు కనిపించడం లేదు
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో దివ్యవాణి నటించారు. చాలాకాలం నుంచి సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె. 'మహానటి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను హీరోయిన్ గా చేసిన రోజులను గురించి .. ఇప్పటి పరిస్థితులను గురించి ప్రస్తావించారు.

"జనరేషన్ ను బట్టి సినిమాల విషయంలో మార్పులు వస్తుంటాయి. 'బాహుబలి' విషయానికే వస్తే .. టెక్నికల్ గా తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. 'మహానటి'ని చూస్తే సహజత్వం కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. అప్పట్లో సెట్లో కుటుంబ వాతావరణం ఎక్కువగా ఉండేది. కలిసి పనిచేస్తున్నవాళ్లమంతా కష్టసుఖాలు మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడంతా 'నీతో మాట్లాడితే నా కేంటి' అన్నట్టుగా మారిపోయింది. ఎవరికి వాళ్లు తమకి కేటాయించిన 'కారవాన్' లోకి వెళ్లి కూర్చుంటున్నారు. అప్పట్లో వున్న ఆప్యాయతలు .. పలకరింపులు ఇప్పుడు కనిపించడం లేదు అంతే" అంటూ చెప్పుకొచ్చారు.      
divyavani

More Telugu News