కొరటాల మూవీలో చిరూ ద్విపాత్రాభినయం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరటాల మూవీలో చిరూ ద్విపాత్రాభినయం?

  • 'సైరా'తో బిజీగా చిరంజీవి 
  • నెక్స్ట్ మూవీ కొరటాలతో
  • త్వరలోనే సెట్స్ పైకి  
చిరంజీవి ఒక వైపున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాను చేస్తూనే, మరో వైపున కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొరటాల వినిపించిన కథకి చిరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండనుంది? చిరంజీవి పాత్ర తీరుతెన్నులు ఎలా వుండనున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది.

ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను .. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు పాత్రలను కూడా కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై వున్నాడని అంటున్నారు. కొరటాల వరుసగా ఘన విజయాలను అందుకుంటూ వస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందో చూడాలి.  
chiranjeevi
koratala

More Telugu News