నేనూ మహానటి సావిత్రిలా అయిపోయేదాన్ని... తృటిలో తప్పించుకున్నా: సమంత

మహానటి సావిత్రి జీవిత కథకు, తన కథకు కొన్ని పోలికలు ఉన్నాయని సమంత వెల్లడించింది. పెళ్లయిన తరువాత కూడా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళుతున్న అక్కినేని వారింటి కోడలు సమంత, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సావిత్రి జీవిత కథ తెలుసుకుంటుంటే, అది తన కథలానే అనిపించిందని చెప్పింది.

ప్రేమ విషయంలో ఆమెలానే తానూ నమ్మానని, అయితే, అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని, లేకుంటే తన కథ కూడా సావిత్రిలానే అయ్యుండేదని తెలిపింది. ఆ బాధ నుంచి త్వరగానే బయట పడ్డానని, తాను చేసుకున్న పుణ్యం, తన అదృష్టం కారణంగానే చైతూ దొరికాడని ఇప్పుడు అనిపిస్తోందని చెప్పింది.

తనకు పెళ్లి అయినా, సినిమాల్లో అవసరమైతే రొమాన్స్ సీన్లకు సిద్ధమేనని, నటన తన వృత్తని చెప్పింది. హీరో ఎవరైనా, తెరపై రొమాన్స్ కూడా నటనేనని, సినిమాలతో మూడు తరాలుగా అనుబంధం ఉన్న అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు తన నటనను సీరియస్ గా తీసుకుంటారని భావించడం లేదని అంది. ఎటొచ్చీ తాను చేసే పాత్రలు హుందాగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకూ తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Samantha
Mahanati
Savitri
Naga Chaitanya

More Telugu News