Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్‌కి కల్యాణ్‌ రామ్‌ ఫిట్ నెస్ సవాల్‌.. నాగార్జున సవాల్‌కి 'చచ్చాను' అంటూ నాని రిప్లై

  • తారక్‌ విసిరిన ఫిట్ ‌నెస్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన కల్యాణ్‌రామ్‌
  • జిమ్‌లో వ్యాయామం
  • బన్నీతో పాటు రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌లకు సవాలు
సినీనటుడు మోహన్ లాల్ విసిరిన ఫిట్‌నెస్‌ సవాలును స్వీకరించిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి... మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ఛాలెంజ్‌ చేసిన విషయం తెలిసిందే. వారిలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఈరోజు ఛాలెంజ్‌ స్వీకరించి జిమ్‌లో వ్యాయామం చేశాడు.

అందరూ ఫిట్‌నెస్‌తో ఆరోగ్యంగా ఉండాలని సందేశాన్నిచ్చాడు. యంగ్‌ హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లకు కల్యాణ్‌ రామ్‌ ఛాలెంజ్‌ విసిరాడు. కాగా, మరోవైపు ఇటీవల అక్కినేని నాగార్జున విసిరిన చాలెంజ్‌పై నాని స్పందించి, 'చచ్చాను' అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌కు చాలా మంది సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందించి ఛాలెంజ్‌ను స్వీకరిస్తోన్న విషయం విదితమే.
ram
Allu Arjun
Nani

More Telugu News