Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సులు మారాలంటే లింక్ టికెట్... ప్రయాణికులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ!

  • ఒకేసారి రెండు బస్సులకు టికెట్
  • కొత్త విధానాన్ని ప్రారంభించిన ఆర్టీసీ
  • ఆపై సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా
నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి ఓ కుటుంబం షిర్డీ వెళ్లాలని అనుకున్నప్పుడు, వారు ఒకేసారి లింక్ టికెట్ ను కూడా బుక్ చేసుకునే సౌకర్యం ఇప్పుడు దగ్గరైంది. టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ లో లింక్ టికెట్ ఆప్షన్ ను ఎంచుకుని, ప్రయాణాన్ని చేయవచ్చని  రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఇ.యాదగిరి వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకుని వచ్చామని చెప్పిన ఆయన, లింక్ టికెట్‌ కొనుగోలు చేసిన వారు, ప్రయాణపు తేదీ రోజున బస్సు బయలుదేరే ముందు, బస్సు గమ్యానికి చేరుకున్న తరువాత, 6 గంటల్లోపు టికెట్‌ / ఎస్‌ఎంఎస్‌ చూపి సిటీ బస్ సర్వీసుల్లో ప్రయాణించ వచ్చని ఆయన తెలిపారు. ఏసీ, నాన్ ఏసీ బస్సులు మారాల్సి వున్నా టికెట్ ను ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
Link Ticket
Telangana
TSRTC

More Telugu News