'డేటింగ్ ప్రారంభిస్తే దాచి పెట్టే రకాన్ని కాను'... హీరోయిన్ నిధి అగర్వాల్ తో ప్రేమపై కేఎల్ రాహుల్!

  • నిధి అగర్వాల్ తో కనిపించిన కేఎల్ రాహుల్
  • డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు
  • ఖండించిన రాహుల్
  • నిధి స్నేహితురాలేనని వెల్లడి
ఇటీవల ముంబైలో బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో కేఎల్ రాహుల్ కనిపించిన తరువాత వీరిద్దరి మధ్యా డేటింగ్ మొదలైందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు, వీరిద్దరూ కలిసున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, రాహుల్ స్పందించాడు. తన జీవితంలోకి వచ్చే అమ్మాయిని ఓ ప్రిన్సెస్ లా చూస్తానని, ఎవరితోనైనా డేటింగ్ ప్రారంభిస్తే దాచి పెట్టబోనని చెప్పాడు.

 "ఓ అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉండలేరా? అదేమంత కష్టమా?. నిధి నాకు చాలా కాలంగా తెలుసు. ఇద్దరమూ ఒకే నగరం నుంచి వచ్చాం. తాను ఎంచుకున్న రంగంలో ఆమె చక్కగా సాగుతోంది. నేను క్రికెటర్, ఆమె నటి కాకముందు నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది. మేమిద్దరమే కలసి బయటకు వెళ్లలేదు. ఆ రోజు మాతోపాటు ముగ్గురు, నలుగురు స్నేహితులు కూడా ఉన్నారు.

 స్నేహితులతో కలసి తిరగడం ఎవరికైనా బాగుంటుంది కదా... అక్కడేమీ జరగలేదని నేను చెబుతున్నాను. నా జీవితంలోకి ఎవరైనా వస్తే, అది ప్రతి ఒక్కరికీ తెలియజేస్తాను. ఏదీ దాచను" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా, తామిద్దరమూ మంచి స్నేహితులమని, తమ మధ్య ప్రేమ, డేటింగ్ లేవని ఇప్పటికే నిధి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

KL Rahul
Nidhi Agarwal
Dating
Love
Social Media

More Telugu News