నువ్వా? నేనా? అంటున్న 'ఆటగాళ్లు' .. రిలీజ్ డేట్ ఖరారు!
- పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు'
- హీరోలుగా జగపతి .. నారా రోహిత్
- జూలై 5వ తేదీన భారీ రిలీజ్
ఇటీవలే షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. జగపతిబాబు .. నారా రోహిత్ పాత్రలు నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంటాయట. ఇటు జగపతిబాబు .. అటు నారా రోహిత్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని పరుచూరి మురళి అంటున్నారు. ఇక దర్శన బానిక్ కూడా ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందనే ఆశతో వుంది.