చిన్నమ్మాయి పెళ్లి చూపులకని వచ్చి.. పెళ్లయిన పెద్దమ్మాయిని తీసుకుపోయాడు!
- తమిళనాడు పోలీసుల ముందు విచిత్రమైన కేసు
- పెళ్లిచూపుల్లో అక్కతో మాట కలిపి బుట్టలో వేసుకున్న యువకుడు
- డబ్బు, నగలతో వెళ్లిపోయిన పెద్దమ్మాయి
మరిన్ని వివరాల్లోకి వెళితే, చెన్నై, మైలాపూరు పరిధిలోని ఏకాంబరం పిళ్లైకి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి (26) పెళ్లి అయి, మూడేళ్ల కొడుకున్నాడు. చిన్నమ్మాయి (22)కి వివాహం చేయాలన్న ఉద్దేశంతో సంబంధాలు వెతుకుతుండగా, అన్నాదురై (28) అనే యువకుడి సంబంధం గత జనవరిలో వచ్చింది. పెళ్లి చూపులకు వచ్చిన అతను, ఆ సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపాడు. పెళ్లి విషయమై ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదుగానీ, పెద్దమ్మాయితో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పెద్ద కుమార్తె అదృశ్యం కాగా, ఆమె అన్నాదురైతో కలసి వెళ్లిపోయిందని తెలుసుకున్న తండ్రి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆ జంట ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.