Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్మతో అఖిల్ మూవీ గురించి నాగార్జున

  • నాగార్జున హీరోగా 'ఆఫీసర్' 
  • రేపే భారీస్థాయిలో రిలీజ్ 
  • అఖిల్ తో వర్మ చర్చలు నడుస్తున్నాయి  
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా 'ఆఫీసర్' సినిమా చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, జూన్ 1వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ, 'ఆఫీసర్' కంటెంట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా తన అభిమానులను ఎంతమాత్రం నిరుత్సాహపరచదని అన్నారు.

ఈ నేపథ్యంలోనే .. అఖిల్ తో సినిమా ఉందంటూ వర్మ చెప్పింది నిజమేనా? అనే ప్రశ్న నాగార్జునకి ఎదురైంది. "వర్మతో అఖిల్ సినిమా ఉంటుందని నేనైతే ట్వీట్ చేయలేదుగా. వర్మతో అఖిల్ సినిమాకి సంబంధించి చర్చలైతే నడుస్తున్నాయి .. ఏం జరుగుతుందో చూడాలి" అన్నారు. మొత్తానికి ఆ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలైతే జరుగుతున్నట్టు నాగ్ మాటల వలన తెలుస్తోంది. ఈ విషయంలో నాగ్ ను వర్మ ఒప్పించగలుగుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం అఖిల్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.       
nagarjuna
varma
akhil

More Telugu News