జియోకు పోటీగా దూసుకొస్తున్న పతంజలి సిమ్ కార్డులు.. ప్లాన్ ల వివరాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జియోకు పోటీగా దూసుకొస్తున్న పతంజలి సిమ్ కార్డులు.. ప్లాన్ ల వివరాలు!

  • బీఎస్ఎన్ఎల్ తో జతకట్టిన పతంజలి
  • 'స్వదేశీ సమృద్ధి' పేరిట సిమ్ కార్డులు
  • తొలి దశలో పతంజలి సిబ్బందికి మాత్రమే అందుబాటులోకి సేవలు
టెలికాం రంగంలో ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసిరి, దూసుకుపోతున్న జియో తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతోంది. ఇప్పటికే ఫుడ్, హోమ్ కేర్, ఆయుర్వేద మెడిసిన్, పర్సనల్ కేర్ తదితర విభాగాల ఉత్పత్తులతో మార్కెట్ లో సింహభాగం కైవసం చేసుకున్న పతంజలి సంస్థ తాజాగా టెలికాం మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది.

'స్వదేశీ సమృద్ధి' పేరిట సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తో జతకట్టిన బాబా రాందేవ్... పతంజలి సిమ్ లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తొలి దశలో ఈ సిమ్ కార్డులు కేవలం పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

సిమ్ కార్డుల ప్లాన్ ల వివరాలు!

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 144 ప్లాన్:
నెల రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్. ఆలిండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 792 స్పెషల్ ప్లాన్ ఓచర్:
6 నెలల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్. ఆలిండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 1584 స్పెషల్ ప్లాన్ ఓచర్:
ఒక సంవత్సరం వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్, ఆల్ ఇండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.
patanjali
sim cards
bsnl

More Telugu News