ఈ మాత్రం సీట్లతో ఎలా చక్రం తిప్పుతారో చంద్రబాబు, జగన్ చెప్పాలి: ఉండవల్లి

  • 25 మంది ఎంపీలతో చక్రం ఎలా తిప్పుతారు?
  • సీట్ల కోసం రాష్ట్రాన్ని ఏకాకిని చేయవద్దు
  • లైవ్ టెలికాస్ట్ లేకపోతే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేది
ఏపీలో ఉన్నదే 25 లోక్ సభ స్థానాలని... ఈ మాత్రం ఎంపీలతో ఢిల్లీలో ఎలా చక్రం తిప్పుతారో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో పూర్తి స్థాయిలో చర్చ జరిగితేనే విభజన నేరం ఎవరిదనే విషయం తేలుతుందని చెప్పారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు సీట్లను గెలుచుకోవడంపై దృష్టిని సారించాయని, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఏకాకిని చేయవద్దని కోరారు. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా లైవ్ టెలికాస్ట్ ను అందుబాటులో ఉంచాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని... ఒక వేళ లైవ్ టెలికాస్ట్ లేకపోతే బీజేపీ అధికారంలో ఉండేదని చెప్పారు. 
Go Back to Shorts
Undavalli
Chandrababu
Jagan

More Telugu News