csk: ఐపీఎల్ కప్ తో సందడి చేసిన విమాన పైలట్, ఎయిర్ హోస్టెస్ లు!

షార్ట్స్‌లో చూడండి
రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్ లో పున:ప్రవేశం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో సీఎస్కే జట్టు చెన్నైకు చేరుకుంది. విమానాశ్రయంలో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు చెన్నై క్రికెటర్లు తమ విమానంలో ప్రయాణిస్తుండటంతో విమాన సిబ్బంది ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. విమానంలో ఆటగాళ్లతో కలసి విమాన పైలట్, ఎయిర్ హోస్టెస్ లు కేక్ కట్ చేశారు. కప్ ను చేతిలో పట్టుకుని ఫొటోలు దిగారు. క్రికెటర్లతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేశారు.
.
Go Back to Shorts
csk
ipl
ait hostess
jet airways

More Telugu News