దేశవ్యాప్తంగా బ్యాంకులే కాదు, ఏటీఎంలూ పనిచేయవు: ఉద్యోగ సంఘాల ప్రకటన
- మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు
- నేడు, రేపు 10 లక్షల మంది సమ్మెలోకి
- పని చేయనున్న ప్రైవేటు బ్యాంకులు
బ్యాంకుల్లో నిర్వహణా లాభాలు పెరుగుతూ, సిబ్బంది వ్యయాలు తగ్గినప్పటికీ, వేతనాల పెంపును పరిగణనలోకి తీసుకోలేదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కాగా, చెక్కుల క్లియరెన్స్ మినహా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మామూలుగానే పనిచేయనుండగా, భారత బ్యాంకింగ్ రంగంలో 75 శాతం వాటా ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.