ఆరెస్సెస్ సమావేశానికి వెళతారా? మీ నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది!: ప్రణబ్‌కు మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ లేఖ
- కాంగ్రెస్ వ్యక్తిగా మీరలా చేస్తారనుకోలేదు
- మీ ఆకస్మిక నిర్ణయంతో ఆశ్చర్యపోయా
- బ్యాక్ గ్రౌండ్‌ను మర్చిపోయి ప్రవర్తించడం సరికాదు
ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంఘం చీఫ్ మోహన్ భగవత్ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీతో దగ్గరి సంబంధాలున్న ఆరెస్సెస్ సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నారన్న వార్త కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన ఆ సమావేశానికి ఎలా హాజరవుతారంటూ పార్టీ నేతలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ షరీఫ్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.