సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సంచలనం.. కశ్మీర్లో టాపర్గా వేర్పాటువాద నేత కుమార్తె!
- 97.8 శాతం మార్కులు సాధించిన సామా షబీర్
- తీహార్ జైలులో ఉన్న సామా తండ్రి షబీర్ షా
- రాష్ట్ర యువతకు సామా ఆదర్శం కావాలన్న సీఎం
కశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడం పార్టీ (జేకేడీఎఫ్పీ) చీఫ్ అయిన షబీర్ షా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కశ్మీర్ లోయలో అల్లర్లు రేకెత్తించేందుకు షబీర్ షా నిధులు సమకూర్చారన్న అభియోగాలపై గత సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాను అరెస్ట్ చేసింది.
12వ తరగతి ఫలితాల్లో టాపర్గా నిలిచిన సామా షబీర్ను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభినందించారు. రాష్ట్రంలోని యువతకు ఆమె విజయం స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.