మహానాడులో కేసీఆర్ కు వ్యతిరేకంగా పాటలు.. వారించిన ఎల్.రమణ!
- కళాకారులు అనుచిత పదాలు వాడటం మంచిది కాదు
- నాయకులు తప్పులు చేస్తే సమాజమే శిక్షిస్తుంది
- తెలంగాణలో చరిత్రను మళ్లీ తిరగరాస్తాం
ఈ సందర్భంగా ఎల్.రమణ ప్రసంగిస్తూ, వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు టీడీపీని వీడారని చెప్పారు. చంద్రబాబు అండతో తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, చరిత్రను తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని అన్నారు.