అమృతానందమయి ఆలింగనాలు కావాలంటూ.. అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్ ట్వీట్

  • భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి
  • బాధలతో తన వద్దకు వచ్చి వారిని ఆలింగనంతో ఓదార్చే 'మాత'
  • ర్యాప్‌ సింగర్‌ ట్వీట్‌పై స్పందించిన అమృతానందమయి
భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి ఆలింగనాలు తమకు కూడా కావాలంటూ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. గతంలోనూ ఆయన ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. దాదాపు సంవత్సరం పాటు ట్విట్టర్‌కు దూరంగా ఉన్న ఆయన మళ్లీ తన ఖాతాను తెరచి ఇటువంటి ట్వీట్‌ చేశాడు. ఇప్పటి వరకు అమృతానందమయి 32 మిలియన్ల ఆలింగనాలు ఇచ్చారని, అలాంటివి తమకూ కావాలని పేర్కొంటూ దుమారం రేపాడు.

కేరళకు చెందిన మాతా అమృతానందమయి తన భక్తులను ఆలింగనం చేసుకుని, ఆశీర్వదించి పంపుతుంటారు. ఈ నేపథ్యంలో కాన్యే ఇలా డబుల్‌ మీనింగ్‌తో ట్వీట్ చేశారు. కాన్యే ట్వీట్‌పై స్పందించిన మాతా అమృతానందమయి మాట్లాడుతూ... తన వద్దకు వచ్చే భక్తులు వారి సమస్యలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటారని, వారిని సమస్యల నుంచి దారి మళ్లించడానికే ఆలింగనం చేసుకుంటానని అన్నారు.

america
amma
hugs

More Telugu News