కేరళలో భయపెడుతున్న నిపా వైరస్... ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం
- ఈ వైరస్ కు ఇప్పటికే 10 మంది బలి
- వైద్య నిపుణులను పంపుతున్న కేంద్రం
- నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కేరళ సీఎం ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అందిస్తామని నడ్డా చెప్పారు. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. తాజాగా పెరంబ్ర తాలూకా హాస్పిటల్ కు చెందిన లిని (31) అనే నర్స్ మృతి చెందింది. నిపా వైరస్ బాధితులకు చికిత్స చేస్తూ ఆమె బలైపోయింది. అధిక జ్వరం కారణంగా కోజికోడ్ లో మరో ఐదుగురు మరణించగా, వారి లక్షణాలు ఈ వైరస్ ను పోలి ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దని, నివారణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.