అసలేంటీ పని?... డూప్ లేకుండా ఈ రిస్కీ ఫైట్లేంటి?: ప్రభాస్ కు క్లాస్ పీకిన అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసలేంటీ పని?... డూప్ లేకుండా ఈ రిస్కీ ఫైట్లేంటి?: ప్రభాస్ కు క్లాస్ పీకిన అనుష్క

  • దుబాయ్ లో 'సాహో' షూటింగ్
  • డూప్ పెట్టుకోకుండా నటిస్తుంటే ప్రభాస్ కు గాయాలు
  • దుబాయ్ వెళ్లి మరీ రిస్కీ షాట్స్ వద్దని చెప్పిన అనుష్క
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్కలు అత్యంత విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారన్న సంగతి తెలిసిందే. మిర్చి, బాహుబలి తదితర సినిమాల్లో వీరిద్దరి జోడీ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక ప్రభాస్ తన నూతన చిత్రం 'సాహో' కోసం దుబాయ్ లో నెల రోజులకు పైగా మకాం వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతమైన పోరాట దృశ్యాలు ఉండాలని, అవి హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో రూ. 90 కోట్లతో ఫైట్ సీన్ ను చిత్రీకరించారని వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక షూటింగ్ సమయంలో మరింత రియాల్టీ కోసం డూప్ లేకుండా ప్రభాస్ షూటింగ్ చేయగా, ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్ కు రెండు సార్లు గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అనుష్క, హుటాహుటిన దుబాయ్ వెళ్లి, ప్రభాస్ కు గంటకు పైగా క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ షాట్లు కూడదని, ఏదైనా జరిగితే అభిమానులు ఎంతో బాధపడతారని నచ్చజెప్పిందట.

రిస్క్ తో కూడుకున్న షాట్స్ ను డూప్ సహాయంతోనే పూర్తి చేయాలని కాస్తంత గట్టిగా అనుష్క చెప్పేసరికి, సరేనంటూ తలూపిన ప్రభాస్, డూప్ ను పెట్టుకుంటానని ప్రామిస్ కూడా చేశాడని సమాచారం. ఇక తన బెస్ట్ ఫ్రెండ్ కోసం దుబాయ్ వెళ్లిన అనుష్కను టాలీవుడ్ వర్గాలు మెచ్చుకుంటున్నాయి. ఒక దశలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వారు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని ఇద్దరూ ఖండించారు.
Dubai
Prabhas
Sahoo
Anushka Shetty
Risky Shots
Dupe

More Telugu News