kumara swamy: ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో కుమారస్వామి భేటీ

  • ఈ నెల 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
  • మంత్రివర్గ కూర్పుపై చర్చ
  • 10 జన్‌పథ్‌లో సమావేశం
ఈ నెల 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్‌ నేత కుమారస్వామి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసిన ఆయన తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10 జన్‌పథ్‌ చేరుకుని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలను కలిశారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై వారితో చర్చిస్తున్నారు. కాగా, తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే.        
kumara swamy
New Delhi
Congress
jds

More Telugu News