West Godavari District: ఎయిర్‌పోర్టు కడతామన్నారు.. కనీసం రోడ్డైనా వేయలేదు: చంద్రబాబుపై జగన్ విమర్శలు

  • ఇసుక నుంచి పోలవరం కాంట్రాక్టుల వరకు దోపిడీ  
  • ప.గోదావరి జిల్లాకు చంద్రబాబు ఏం చేశారు?
  • అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పనులను కూడా పూర్తిచేయలేదు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఇసుక నుంచి పోలవరం కాంట్రాక్టుల వరకు దోపిడీ కొనసాగుతోందని అన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అన్ని నియోజక వర్గాల్లో టీడీపీకి చెందిన వారినే గెలిపించారని, మరి ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఈ జిల్లాకు ఏమిచ్చారని  జగన్ ప్రశ్నించారు.

తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు కడతామన్న చంద్రబాబు ఇక్కడ కనీసం రోడ్డైనా వేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌ హయాంలో మంజూరైన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పనులను కూడా పూర్తిచేయలేకపోయారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా.. చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు రౌడీయిజం, అధికారులపై దౌర్జన్యం ఎలా చేయాలనే విషయంపై శిక్షణ ఇస్తున్నారని ఆరోపించారు.     
West Godavari District
airport
Chandrababu

More Telugu News