పాక్లో కృష్ణుడి ఆలయానికి పునర్వైభవం.. రూ.2 కోట్ల కేటాయింపు
- పాక్ హిందువులకు శుభవార్త
- శ్రీకృష్ణుడి ఆలయ పునరుద్ధరణకు నిధుల కేటాయింపు
- త్వరలో పనులు ప్రారంభం
చట్టసభకు చెందిన ఓ ప్రతినిధి అభ్యర్థన మేరకు ఆలయ పునరుద్ధరణకు నిధులు కేటాయించినట్టు స్థానిక పత్రిక పేర్కొంది. పనులు ప్రారంభించడానికి ముందు ఆలయంలోని విగ్రహాలను రెండు గదుల్లో భద్రపరిచారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత పూజలు చేసుకునేందుకు ఎక్కువమంది భక్తులకు అవకాశం కలుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఇక్కడి కృష్ణుడి ఆలయాన్ని కాంజీమాల్, ఉజాగర్ మాల్ రామ్ రాచ్చాల్లు 1897లో నిర్మించారు.