తప్పుల మీద తప్పులు చేసిన రమణ దీక్షితులు: మీడియా సమావేశంలో టీటీడీ ఈవో
- రమణ దీక్షితులు చేసిన విమర్శలు అవాస్తవాలు
- పూజలు, కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి
- తాజా ఆరోపణలపై రమణ దీక్షితులుకు నోటీసులు
- మీడియా సమావేశంలో అనిల్ కుమార్ సింఘాల్
2012లోనే అర్చకుల పదవీ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించినట్టు గుర్తు చేసిన ఆయన, అప్పట్లో ముగ్గురు అర్చకులు రిటైర్ అయ్యారని తెలిపారు. ఆ సమయంలో వారు కోర్టుకు వెళ్లగా, కోర్టు వారి పిటిషన్ ను తిరస్కరించి, జీతభత్యాలు లేని అర్చకులుగా కొనసాగవచ్చని సూచించిందని చెప్పారు.
ప్రస్తుతమున్న అర్చకుల సర్వీస్ ప్రకారం సీనియర్ ను ప్రధాన అర్చకులుగా నియమించామని అన్నారు. భక్తులకు నిజానిజాలు తెలిపేందుకు మాత్రమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానని అన్నారు. మిరాశీ వంశీకులకు, బ్రాహ్మలకు ఎటువంటి అన్యాయమూ జరగబోదని హామీ ఇచ్చారు. స్వామి సేవల నిమిత్తం ఒక్కో కుటుంబంలో ఒకరికి చొప్పున నలుగురికి ప్రధాన అర్చక పదవులను ఇచ్చామని తెలిపారు.