క్యూబాలో కుప్పకూలిన విమానం.. వందమందికి పైగా దుర్మరణం
- టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం
- విమానంలో 114 మంది
- మృతుల్లో ఐదుగురు చిన్నారులు
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు విమానం కూలినట్టు తెలుస్తోంది. విమాన శకలాలు 20 కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి. మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు డియాజ్ కేనల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. కాగా, తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళలను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు తర్వాత ప్రాణాలు విడిచారు. మిగతా ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.