కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఫన్నీ వాదనలు చేస్తోంది: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
- కాంగ్రెస్ పార్టీకి రూల్స్ పట్ల అవగాహన లేదు
- తమ ఎమ్మెల్యేలపై నమ్మకం కూడా లేదు
- అందుకే వారిని రిసార్ట్లలో ఉంచారు
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాము నియమాల ప్రకారమే కర్ణాటకలో ముందుకు వెళుతున్నామని, కాంగ్రెస్ పార్టీకి రూల్స్ పట్ల అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ఫన్నీ వాదనలు చేస్తోందని అన్నారు. అలాగే, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల అధిష్ఠానాలకు తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని, అందుకే వారిని రిసార్ట్లలో ఉంచారని చురకలంటించారు. ఆ రెండు పార్టీలకు భయం పట్టుకుందని జవదేకర్ అన్నారు.