తమపై వస్తున్న వార్తలపై జేడీఎస్ మిస్సింగ్ ఎమ్మెల్యేల స్పందన
- మేము ఎక్కడికీ పోలేదు
- 450 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసరికి.. లేట్ అయింది
- ఎప్పటికీ కుమారస్వామితోనే ఉంటాం
ఈ నేపథ్యంలో, వారిద్దరూ స్పందించారు. తాము ఎక్కడికీ పోలేదని చెప్పారు. కుమారస్వామితోనే తాము ఉంటామని తెలిపారు. బెంగళూరుకు తాము 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, అందుకే సమయానికి సమావేశానికి హాజరు కాలేకపోయామని చెప్పారు. దీనికి తోడు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కూడా అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము బీజేపీకి దగ్గర కాబోమని... ఎప్పటికీ జేడీఎస్ లోనే ఉంటామని చెప్పారు.