‘కాంగ్రెస్’లోని ‘లింగాయత్’ ఎమ్మెల్యేల తిరుగుబాటు?
- జేడీఎస్ నేత కుమారస్వామిని సీఎంగా వద్దంటున్న వైనం
- లింగాయత్ సామాజిక వర్గ ఎమ్మెల్యేల అభ్యంతరం!
- తమ ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాల్లోని రిసార్ట్స్ కు తరలించనున్న కాంగ్రెస్ అధిష్ఠానం!
అయితే, కుమారస్వామిని సీఎంగా చేయాలన్న ఆలోచనపై కాంగ్రెస్ పార్టీలోని లింగాయత్ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. కుమారస్వామికి ఆ పదవి కట్టబెట్టాలనుకోవడం వారికి ఇష్టం లేదని తెలుస్తోంది. దీనిని నిరసిస్తూ తిరుగుబాటు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాల్లోని రిసార్ట్స్ కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రోడ్డు మార్గంలో కాకుండా ప్రత్యేక విమానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విలాసవంతమైన రిసార్ట్స్ కు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.