కర్ణాటకలో విచిత్రం.. ఓట్లు కాంగ్రెస్ కు.. సీట్లు బీజేపీకి!
- హంగ్ దిశగా కర్ణాటక ఫలితాలు
- 105 స్థానాల్లో ఆధిక్యతలో బీజేపీ
- బీజేపీ కన్నా 1.4 శాతం ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్
బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత వచ్చినప్పటికీ... కాంగ్రెస్ తో పోల్చితే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం తక్కువే. కాంగ్రెస్ కు 38.1 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి కేవలం 36.7 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీని మాత్రమే సాధించడం దీనికి కారణం. మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ గెల్చిన స్థానాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది.