ఒప్పో సంచలనం రూ.8,999కే అదిరిపోయే ‘రియల్ మీ 1’ ఫోన్
- 6జీబీ ర్యామ్, 128జీబీ ర్యామ్ ధర రూ.13,999
- బాడీలో స్క్రీన్ రేషియో 84.8 శాతం
- అమేజాన్ లో మాత్రమే విక్రయం
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.8,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.13,990. ప్రత్యేకంగా అమేజాన్ డాట్ ఇన్ లో మాత్రమే విక్రయమవుతాయి. అమేజాన్, ఒప్పో కలసి రియల్ మీ1 ని ఆవిష్కరించాయి. ఏడు లేయర్లతో కూడిన సిరామిక్ టెక్నాలజీతో ఫోన్ బాడీని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది.
ఈ ఫోన్ 18:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. బాడీలో స్క్రీన్ నిష్పత్తి 84.8 శాతం. స్క్రీన్ 6 అంగుళాలు. ఫుల్ హెచ్ డీ+ స్క్రీన్. మల్టీ టాస్కింగ్ స్మూత్ గా సాగుతుందని కంపెనీ ప్రకటించింది. రెండు సిమ్ లకు, మెమొరీ కార్డుకు కలిపి మూడు వేర్వేరు స్లాట్లను ఏర్పాటు చేశారు. రెండు సిమ్ లు కూడా 4జీకి సపోర్ట్ చేస్తాయి. మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్ వాడారు. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ సమయం పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల 25న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది.