కన్నడనాట 160 స్థానాల్లో తొలి ట్రెండ్స్ వెల్లడి... ఆధిక్యంలోకి వచ్చేసిన సిద్ధరామయ్య!
- 66 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
- 71 చోట్ల బీజేపీ ముందంజ
- బాదామిలో 384 ఓట్ల ఆధిక్యంలో సిద్ధరామయ్య
బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బీజేపీ తరఫున పోటీ చేసిన గాలి సోమశేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రామనగర్ లో జేడీఎస్ నేత కుమారస్వామి 2 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. బాదామిలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత శ్రీరాములు కన్నా సీఎం సిద్ధరామయ్య 384 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తరువాత సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన ఆధిక్యంలోకి వచ్చారు.