వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర'లో కేవీపీ పాత్రపై క్లారిటీ!

  • మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యాత్ర'
  • వైఎస్ పాత్రను పోషిస్తున్న మమ్ముట్టి
  • కేవీపీ పాత్రలో రావు రమేష్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా, ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న 'యాత్ర' బయోపిక్ లో కేవీపీ రామచంద్రరావు పాత్రను ఎవరు పోషించనున్నారన్న విషయమై క్లారిటీ వచ్చేసింది. ఈ పాత్రను రావు రమేష్ పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ ఓ అప్ డేట్ ఇచ్చింది. ఇక ఇదే చిత్రంలో నాదెండ్ల భాస్కర్ రావు పాత్రను బాలీవుడ్ నటుడు సచిన్ కెడ్కర్ చేస్తున్నాడని పేర్కొంది. నిజ జీవితంలో వైఎస్ఆర్ కు ప్రాణ స్నేహితునిగా ఉన్న కేవీపీ పాత్రకు రావు రమేష్ చక్కగా న్యాయం చేయగలుగుతారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Yatra
Mammutti
Rao Ramesh
YSR

More Telugu News