పాట్నాలో హత్యకు గురైన ఆర్జేడీ నాయకుడు!
- బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా సంఘటన
- దీనా గోపేపై గుర్తుతెలియని వ్యక్తులు ఏకే 47తో కాల్పులు
- ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు
ఈ వేడుక నుంచి తిరిగి బయలుదేరిన ఆయన, అనూషాబాద్ లోని తన ఇంటికి సమీపంలోకి రాగా గుర్తుతెలియని వ్యక్తులు ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డ అనంతరం పారిపోయారని చెెప్పారు. కాగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం ఈరోజు సాయంత్రం జరగనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, వీవీఐపీలు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పాట్నాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంత భద్రత ఉన్న తరుణంలో ఈ హత్య జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.