Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నా పేరు సూర్య' తొలివారం వసూళ్లు .. ఇంకా 'అంత' రాబట్టాలి!

  • తొలివారం నైజామ్ వసూళ్లు 11.10 కోట్లు 
  • తెలుగు రాష్ట్రాల్లో 34.43 కోట్లు 
  • ప్రపంచవ్యాప్తంగా 44.63 కోట్లు    
రచయితగా తానేంటో నిరూపించుకున్న వక్కంతం వంశీ, దర్శకుడిగా 'నా పేరు సూర్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, అల్లు అర్జున్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లో 11.10 కోట్లను వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 34.43 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 44.63 కోట్లకి చేరుకుంది. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడాలంటే ఈ సినిమా ఇంకా 36 కోట్లకి పైగా షేర్ ను రాబట్టవలసి వుందని అంటున్నారు. ప్రస్తుతం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ .. అటు ఓవర్సీస్ లోను 'మహానటి' మంచి జోరుమీద దూసుకుపోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 'నా పేరు సూర్య' ఆశించిన మార్క్ ను అందుకుంటుందేమో చూడాలి. 
Allu Arjun
anu emmanuel

More Telugu News