ఎక్కువ కాలం బతకలేను.. గెలిపించి కాపాడండి: 'జేడీఎస్' నేత కుమారస్వామి
- నా ఆరోగ్యం బాగోలేదు
- అనారోగ్యంతోనే ప్రచారం చేశా
- మీకు సేవ చేయాలనే తపన ఉంది
జేడీఎస్ అధికారంలోకి వస్తే మీ ఇంటి బిడ్డలా మీకు సేవ చేస్తానని తెలిపారు. నేను మీకు కావాలనుకుంటే జేడీఎస్ ను గెలిపించాలని దీనంగా వేడుకున్నారు. నిన్న ఎన్నికల ప్రచారం ముగింపు సభ సందర్భంగా రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గంలోని లగ్గెరెలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజరాజేశ్వరినగర్ లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడటంపై ఆధారాలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.