మరికొన్ని రోజుల్లోనే... ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారుతుంది, చూడండి: బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

11-05-2018 Fri 10:16 | Both States
  • 2004లో ఎదుర్కొన్న పరిస్థితులను టీడీపీ ఎదుర్కోనుంది
  • కేంద్ర సాయం గురించి చెప్పకుండా ఏకపక్ష ప్రచారం
  • బీజేపీ సాయం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?
  • నిప్పులు చెరిగిన జీవీఎల్ నరసింహరావు
నవ్యాంధ్ర రాజకీయాల్లో మరికొన్ని రోజుల వ్యవధిలో అనూహ్య మార్పులు సంభవించనున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పులను ఆహ్వానించేందుకు అన్ని రాజకీయ పార్టీలూ రెడీగా ఉండాలని అన్నారు. కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రచారం చేసుకుంటోందని, 2019లో తెలుగుదేశం పార్టీకి ఇక్కట్లు తప్పవని అన్నారు. పక్క రాష్ట్రంలోని పరిస్థితులే ఇక్కడ కూడా రానున్నాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి ఎక్కడా మాట్లాడటం లేదని, కేంద్రం లేకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమైందో చెప్పాలని ప్రశ్నించారు.

సిగ్గులేకుండా కేంద్ర సాయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కర్ణాటకలో బీజేపీని ఓడించే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులతో విదేశీ యాత్రలు చేసే బదులు, ఆ డబ్బును వ్యవసాయానికి ఇస్తే బాగుండేదని అన్నారు. తెలుగుదేశం అహంకారం, తప్పుడు నిర్ణయాలతో బీజేపీకి ఎటువంటి నష్టం రాదని, 2004లో ఎదురైన పరిస్థితులను వచ్చే సంవత్సరం టీడీపీ ఎదుర్కోనుందని అన్నారు. చంద్రబాబుపై కక్ష పెంచుకున్నది తాము కాదని, ప్రజలని, వారే కక్ష తీర్చుకుంటారని అన్నారు. అబద్ధాల రాజకీయాలు చేసే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని జీవీఎల్ నరసింహరావు హెచ్చరించారు.
TelugudesambjpGVLChandrababu

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more