rajamouli: రాజమౌళి మల్టీ స్టారర్ లైన్ అదికాదు!: చరణ్

  • రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ 
  • హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు  
ప్రస్తుతం చరణ్ .. బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, తాజా షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. ఈ సినిమా తరువాత చరణ్ .. రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ లు అన్నదమ్ములుగా కనిపించనున్నారనీ, బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే టాక్ మొదటి నుంచి కూడా బలంగా వినిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రావడంతో, చరణ్ స్పందిస్తూ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పాడు. తాను ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించడం .. బాక్సింగ్ నేపథ్యం ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. అసలు కథ వేరే ఉందనీ .. అది అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 
rajamouli
ntr
charan

More Telugu News