అంబటి రాయుడిని తీసుకోవడంపై గంగూలీ ఆశ్చర్యం!
- తదుపరి సిరీస్ కు ఎంపికైన అంబటి రాయుడు
- అతని స్థానంలో అజింక్య రహానేను తీసుకోవాల్సింది
- ఇంగ్లండ్ లో రహానే గతంలో రాణించాడన్న గంగూలీ
ఇంగ్లండ్ లో గతంలో పర్యటించిన రహానే ఎంతో చక్కగా రాణించాడని గుర్తు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయుడు రాణిస్తున్నప్పటికీ, ఇటీవలి అతని వన్డే రికార్డు సరిగ్గా లేదని చెప్పాడు. గత 6 మ్యాచ్ లలో కేవలం 140 పరుగులే చేశాడని వెల్లడించాడు. రహానే గడచిన ఏడాదిలో 17 వన్డేల్లో 725 పరుగులు చేశాడని చెప్పాడు. కాగా, పొట్టి క్రికెట్ లో రాణిస్తున్న రాయుడు, 50 ఓవర్ల మ్యాచ్ కి వచ్చేసరికి ఏ మాత్రం రాణించలేక పోతున్న సంగతి తెలిసిందే.