అక్రమ ఆయుధాల కేసులో సూరి హత్యకేసు నిందితుడు భానుకిరణ్ కు ఏడాది జైలు శిక్ష
- అక్రమ ఆయుధాల కేసులో తీర్పును వెలువరించిన నాంపల్లి కోర్టు
- ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా
- గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న భానుకిరణ్
2009లో అక్రమ ఆయుధాల కేసులో భానుకిరణ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పును వెలువరించింది. మరోవైపు మద్దెలచెరువు సూరి హత్యకేసు విచారణ కూడా కొనసాగుతోంది. ఈ హత్య కేసుకు సంబంధించి గత ఐదేళ్లుగా భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు.