అధికార లాంఛనాలతో చమన్ అంత్యక్రియలు పూర్తి
- రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో అంత్యక్రియలు
- హాజరైన పరిటాల సునీత, దేవినేని ఉమ, పలువురు ఎమ్మెల్యేలు
- భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు
రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నిన్న ఉదయం గుండెపోటుకు గురైన చమన్ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.