'సైరా'ను ఆ రోజునే రిలీజ్ చేయాలనుకుంటున్నారట!
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
- చిరూ సరసన నయనతార
- భారీస్థాయిలో గ్రాఫిక్స్ వర్క్
ఈ సినిమాను వచ్చే ఏడాది మే 9వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో చిరంజీవి చేసిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' .. 'గ్యాంగ్ లీడర్' సినిమాలు ఇదే రోజున విడుదలై సంచలన విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని అదే రోజున విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.