శివను విడిచి ఉండలేకనే భర్త హత్యకు ప్లాన్: పోలీసుల విచారణలో నవవధువు సరస్వతి
- పెళ్లి ఇష్టం లేదన్నా చేశారు
- భర్త శంకర్ రావు మంచివాడే
- ప్రియుడి కోసమే దారుణం
ఆ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నా, బలవంతంగా చేశారని చెప్పింది. తన భర్త శంకర్ రావు పవర్ ప్లాంట్ లో పనిచేస్తుంటాడని, మంచి వ్యక్తేనని తనను బాగా చూసుకున్నాడని అంగీకరిస్తూనే, శివను విడిచి ఉండలేక ఈ పని చేశానని విలపించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం తోటపల్లి బ్యారేజ్ సమీపంలో శంకర్ రావు, సరస్వతి బైక్ పై వస్తుండగా, ముగ్గురు దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసు వెనుక కుట్రదారు సరస్వతేనని తెలిసి పోలీసులే విస్తుపోయారు.