'మహానటి'లో మాళవిక నాయర్ పాత్ర ఏమిటంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి'లో మాళవిక నాయర్ పాత్ర ఏమిటంటే..!

  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • ఆమె భర్తగా దుల్కర్ సల్మాన్ 
  • ఆయన మొదటి భార్య పాత్రలో మాళవిక నాయర్     
'మహానటి' సినిమా భారీ బడ్జెట్ తోనే కాదు .. బలమైన తారాగణంతోనూ కనిపిస్తోంది. ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్న నటీనటులు, ఈ సినిమాపై మరింత ఆసక్తిపెరిగేలా చేస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించగా .. జర్నలిస్ట్ మధురవాణి పాత్రను సమంత పోషించింది.

ఇక సావిత్రి భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ .. ఆమె స్నేహితురాలు పాత్రలో షాలిని పాండే .. ఎస్వీ  రంగారావు పాత్రలో మోహన్ బాబు .. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య .. దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ నటించారు. ఇక సావిత్రి భర్త జెమినీ గణేశన్ కు నలుగురు భార్యలనే సంగతి తెలిసిందే. మొదటి భార్య పేరు 'అలమేలు' .. ఈ పాత్రలో మాళవిక నాయర్ నటించింది. ఇంతకుముందు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా చేసిన సంగతి తెలిసిందే. 
malavika nair

More Telugu News