రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో రక్తపాతమే!: సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక
- బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య
- అనంత్‌కుమార్ హెగ్డే అసలు గ్రామ పంచాయతీ నేతగా కూడా పనికిరాడంటూ వ్యాఖ్య
- బీజేపీకి సామ్యవాదం, సామాజిక న్యాయం తెలియవన్న సీఎం
అసమర్థ అనంత్‌కుమార్ హెగ్డే అసలు గ్రామ పంచాయతీ నేతగా కూడా పనికిరాడని, అలాంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేశారంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఒకవేళ నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని మార్చడం లాంటి పని చేస్తే దేశంలో రక్తపాతమే జరుగుతుందని ఈ సందర్భంగా సిద్ధరామయ్య హెచ్చరించారు. పేదలకు మంచి పనులు చేయడం, సామ్యవాదం, సామాజిక న్యాయం లాంటివి ఆ పార్టీకి అస్సలు తెలియదని ఆయన విమర్శించారు.